Malaysia Flight Crash

నడిరోడ్డుపై కుప్ప కూలిన విమానం.

రోడ్డుపై కూలిపోయిన మలేసియా విమానం.. ప్రమాద వీడియో వైరల్‌

ఇంటర్నేషనల్ రిపోర్ట్- మలేసియా (Malaysia)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరేసియా సెంట్రల్‌ సెలంగర్‌ రాష్ట్రంలోని ఓ జాతీయ రహదారిపై చిన్న విమానం (Light Plane) కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. లంగ్‌ కావి ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం గురువారం మధ్యాహ్నం బయలుదేరింది. సుల్తాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ షా ఎయిర్ పోర్ట్ (Sultan Abdul Aziz Shah Airport) వైపు వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఒక్కసారిగా విమానం గాల్లో అస్తవ్యస్తంగా గింగిరాలు తిరిగింది. కాసేపటికే రోడ్డుపై కూలిపోయింది.

ఈ విమాన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విమానం కూలిపోయే సమయంలో కింద్ రోడ్డుపై కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయారని చెప్పారు. విమాన ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్టయ్యాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో రోడ్డుపై భారీగా మంటలు చలరేగడంతో, పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది. Malaysia Flight Accident

 


Comment As:

Comment (0)