Parliament

18న పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల..

నేషనల్ రిపోర్ట్- మోదీ సర్కార్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు (Parliament Special Session) ఏర్పాటు చేయడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది కేంద్రం. ఐతే ఈ సమావేశాల అజెండా ఇంతవరకు వెల్లడించకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూవస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం పార్లమెంట్ సమావేశాల అజెండా ప్రకటించింది. 

ఈ నెల 18న మొదలయ్యే మొదటి రోజు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చించనున్నట్టు లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) సెక్రెటరియేట్ లు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. లోక్‌ సభలో రెండు బిల్లులు, రాజ్యసభలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. ఐతే ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకు మోదీ సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 18న తొలి రోజు సమావేశం పాత భవనంలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఈనెల 19 నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు కొనసాగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Comment As:

Comment (0)