Rashmika Mandanna

తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన రష్మిక

రష్మిక కాళ్లు మొక్కిన వధూ వరుులు - వైరల్ అవుతున్న వీడియో

మూవీ రిపోర్ట్- రష్మిక మందన (Rashmika Mandanna).. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. అందులోను పుష్ప-2 (Pushpa2) సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది రష్మిక. ఐతే ఏ మాత్రం సమయం ఉన్నా తన వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్తుంటుంది. ఇదిగో ఈ క్రమంలోనే తన మేకప్‌ అసిస్టెంట్‌ వివాహ వేడుకలో రష్మిక సందడి చేసింది. ఈ పెళ్లిలో జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి రష్మిక శుభాకాంక్షలు చెప్పగా, కొత్త జంట రష్మిక కాళ్లకు మొక్కారు.

ఈ హఠాత్తు పరిణామానికి ముందు కాస్త కంగారు పడిన రష్మిక, ఆ తర్వాత తేరుకుని వధూ వరులను ఆశీర్వదించింది. ఇంకేముంది ఈ వీడియోను రష్మిక ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. అన్నట్లు తన పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని, మరి కొంత కాలం కెరీర్‌ పైనే దృష్టిపెట్టనున్నట్లు మొన్నా మధ్య ఓ ఇంటర్వూలో చెప్పింది రష్మిక. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప-2 షూటింగ్ తో పాటు మరికొన్ని సినిమాలను చేస్తోంది రష్మిక.


Comment As:

Comment (0)