Vijay-Rashmika

సోషల్ మీడియా ప్రచారాన్ని కొట్టిపడేసిన విజయ్ టీం

విజయ్ దేవరకొండ- రష్మికల వివాహ నిశ్చితార్ధం?

మూవీ రిపోర్ట్- టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్లిద్దరికి నిశ్చితార్థం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ప్రచారంపై విజయ్ దేవరకొండ టీమ్‌ స్పందించింది. రష్మికతో నిశ్చితార్ధం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ద్వార జోరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని విజయ్ దేవరకొండ టీం విజ్ఞప్తి చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక లు గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలు చేశారు. వీళ్లిద్దరు వరుసగా రెండు సినిమాల్లో నటించడం, టూర్స్‌, డిన్నర్‌ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతూవస్తోంది. ఐతే తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చాలా సందర్భాల్లో విజయ్ తో పాటు రష్మిక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరి ప్రేమ, పెళ్లిపై ప్రచారం మాత్రం ఆగలేదు. ఈ ఫిబ్రవరి రెండో వారంలో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ నిశ్చితార్థం జరగబోతోందంటూ ప్రచారం జరగడంతో విజయ్ టీం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. 

అన్నట్టు తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ కు జంటగా నటించిన యానిమల్‌ మూవీతో రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు పుష్ప 2లో నటిస్తోంది రష్మిక. ఇక విజయ్‌ దేవరకొండ పరశురామ్‌ డైరెక్షన్ లో మృణాల్‌ ఠాకూర్‌ కు జంటగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాలో నటిస్తున్నారు. 


Comment As:

Comment (0)