Vijay Rashmika

నా వివాహ జీవితం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా- విజయ్‌ దేవరకొండ

మూవీ రిపోర్ట్- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఈ టాలీవుడ్ హీరో ఏం మాట్లాడినా కాస్త సెన్సేషన్ గానే ఉంటుంది. సినిమాల నుంచి మొదలు తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందు. ఇదిగో ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ఖుషి గురించి చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైహాట్ టాపిక్ గా మారాయి. ఖుషి (Khushi) మూవీ నుంచి ఇటీవల విడుదలైన యుగళ గీతం.. ఆరాధ్య ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సాంగ్ రిలీజ్ కు ముందు విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పెళ్లి చేసుకున్నాక ఈ పాటలో చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు విజయ్.

విజయ్ ఏమన్నాడంటే.. ఖుషి సినిమాలో నాకు ఇష్టమైన పాటల్లో ఆరాధ్య..ఒకటి. వివాహం చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ, భవిష్యత్తులో నా వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నా.. అని చెప్పుకొచ్చాడు. గత కొన్నాళ్లుగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది కదా. ఈ మధ్య కాలంలో కూడా వీళ్లిద్దరు డిన్నర్‌ డేట్స్‌, హాలీడే వెకేషన్స్‌కు వెళ్లి రావడం మరింత ఆసక్తిరేపుతోంది. కానీ తామిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదని,  మేము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు విజయ్, రష్మిక.

ఇదిగో ఇటువంటి సమయంలో ఇప్పుడు మరోసారి విజయ్‌ దేవరకొండ తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో వాళ్ల ప్రేమ టాపిక్‌ మళ్లీ వైరల్ అవుతోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో విజయ్‌ దేవరకొండ, సమంత (Samantha) జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ విడుదలైన నా రోజా నువ్వే.. పాట కూడా సూపర్‌ హిట్‌ అయ్యి ట్రెండింగ్‌లో నిలిచింది. భారీ అంచనాల మధ్య ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
 


Comment As:

Comment (0)