iliana

పిల్లలను కనే సమయంలో అదే పనిగా- ఇలియానా

సినిమా డెస్క్- ఇలియానా డిక్రజ్ గుర్తుందా.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగింది. ఐతే ఆ తరువాత సినిమా అవకాశఆలు సన్నగిల్లడంతో ప్రస్తుతం కెరీర్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని విదేశాల్లో ఉంటోంది (Ileana). అతి తొందరలోనే తల్లి కాబోతున్న ఇలియానా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తన అభిమానులతో మాట్లాడింది. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంది.

అభిమాని ప్రశ్న-బర్ఫీ2 సినిమాలో నటించే అవకాశం వస్తే నటిస్తారా? 

ఇలియానా జవాబు- నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. నా దృష్టిలో బర్ఫీ ఒక్కటే. దానికి ఎన్ని భాగాలు వచ్చినా మొదటి దానిని బ్రేక్‌ చేయలేవు. ఆ ప్రాజెక్ట్‌ లో చేసిన వాళ్లందరితో కలిసి మరో సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చేస్తా.

అభిమాని ప్రశ్న-ప్రెగ్నెన్సీ సమయంలో మీకు వింతగా ఏదైనా తినాలనిపించిందా? 

ఇలియానా  జవాబు-  మినీ క్యారెట్స్‌.

అభిమాని-మీకు బీచ్‌ హౌస్‌ ఏదైనా ఉందా? ఎందుకంటే, మీరు ఎక్కువగా బీచ్‌ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలనే షేర్‌ చేస్తుంటారు కదా? 

ఇలియానా-  ప్రస్తుతానికైతే లేదు. కాకపోతే బీచ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆ ప్రశాంత వాతావరణం.. నా మనసును శాంతపరచి.. సంతోషంగా ఉండేలా చేస్తుంది.

అభిమాని- ఏ సమయంలో మీకు ఐస్‌క్రీమ్‌ లేదా పిజ్జా ఏది ఎక్కువగా తినాలనిపిస్తుంది? 

ఇలియానా-  నిజం చెప్పాలంటే ఇండియన్‌ ఫుడ్‌ తినాలని ఉంది. ఈ మధ్యకాలంలో ఓ మంచి బటర్‌ చికెన్‌, నాన్‌ తినలేదు. ముంబయి ఫుడ్‌ను మిస్‌ అవుతున్నా.

అభిమాని-బరువు పెరుగుతున్నందుకు బాధపడుతున్నారా? 

ఇలియానా- తొలిరోజుల్లో ఈ ప్రశ్న నన్నెంతో మధనపడేలా చేసింది. ఎందుకంటే, పిల్లలను కనే సమయంలో బరువు పెరగడం చూసి ఎదుటివాళ్లు అదేపనిగా కామెంట్స్‌ చేస్తుంటారు. అలాగే చెకప్‌ కోసం వైద్యుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ అక్కడ బరువు చూస్తుంటారు. అలా, వెయిట్‌ పెరుగుతున్నామనే విషయం మన మనసులో పాతుకుపోతుంది. గత కొన్ని నెలలుగా నా శరీరాకృతి మారిన విధానానికి ఆనందిస్తున్నా. ఇదొక అద్భుతమైన ప్రయాణం. అవును నేనూ మనిషినే. కొన్ని సమయాల్లో బాధపడ్డా. నా చుట్టూ ఉన్న గొప్ప వ్యక్తులు.. నాలో ఒక ప్రాణి జీవం పోసుకుంటుందనే విషయాన్ని తరచూ గుర్తు చేసేవాళ్లు. కాబట్టి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరగడం అనేది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. మీ శరీరం చెప్పేది వినండి.. అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది ఇలియానా.
 


Comment As:

Comment (0)