Himanshu KCR

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పెద్ద మనస్సు.. కోటి రూపాయలతో

స్పెషల్ రిపోర్ట్- హిమాన్షు రావు కల్వకుంట్ల తెలుసుకదా.. అందేనండీ తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మనవడు, మంత్రి కేటీఆర్ (KTR) కుమారుడు. పలు సందర్బాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన హిమాన్షు (Himanshu)  ఇప్పుడు తన పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాడు. ఇందుకోసం హిమాన్షు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

హిమాన్షు సీఏఎస్ అధ్యక్షుడిగా తాను చదివే స్కూల్ లో  సేకరించిన నిధులతో ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు. ఈ నెల 12న హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఓ ప్రైవేటు కార్పొరేట్‌ స్కూల్ లో చదివే సమయంలో, ఆ పరిసర ప్రాంత గచ్చిబౌలి కేశవనగర్‌ లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతుండేవాడు హిమాన్షు. 

ఈ క్రమంలో పేద విద్యార్థులు చదువుకునే ఈ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నాడు హిమాన్షు. ఈ క్రమంలో పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ చెప్పారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగు దొడ్ల నిర్మాణం, డైనింగ్ హాల్, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ఇలా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేయడం పట్ల అందరూ ఆయన పెద్ద మనస్సును మెచ్చుకుంటున్నారు.


Comment As:

Comment (0)