Deepika Padukone

ఆదాయపన్ను ఎక్కువగా చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా

పిల్మ్ న్యూస్- సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్లు బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోలతో పోలిస్తే కాస్త రెమ్యనరేషన్‌ తక్కువే అయినా యాడ్స్, బిజినెస్ ల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. నటనతో పాటు ఎండార్స్‌ మెంట్స్‌, యాడ్స్‌ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. మరి బాలీవుడ్ లో అత్యధికంగా ఆదాయ పన్ను చెల్లించే హీరోయిన్‌ ఎవరో తెలుసా మీకు. ఇంకెవరు దీపికా పడుకోన్ (Deepika Padukone). అవును 500 కోట్లు నికర విలువతో బాలీవుడ్ లోన్ అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించి టాప్ లో నిలిచింది దీపికా పడుకోన్‌.

దీపికా పడుకోన్‌ 2016-2017 ఆర్థిక సంవత్సరంలో  ఏకంగా 10 కోట్ల రూపాయలమేర ఆదాయపు పన్ను చెల్లించింది. ఈ క్రమంలో గత సంవత్సరం అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌. దీపికా పదుకోన్‌ సంపాదన సంవత్సరానికి  40 కోట్లు.  ఒక్కో సినిమాకు దాదాపు 15 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక ఎండార్స్‌మెంట్‌ల కోసం 7 నుంచి 10 కోట్లు వసూలు చేస్తుందట.

దీపిక పదుకోన్  ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్‌మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించిందని ఫోర్బ్స్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. పద్మావతి P(admavati) మూవీకోసం దీపికా ఏకంగా 12 కోట్లు  వసూలు చేసిందని సమాచారం. గత సంవత్సరం రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను  వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించింది దీపికా పదుకోన్.

గతంలో ఈ ప్లేస్‌ లో  కత్రినా కైఫ్‌ (katrina kaif) ఉంది. 2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. 10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఆలియా భట్ (alia bhatt) ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాదికు సుమారు 5 నుంచి 6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది.  ప్రియాంక చోప్రా (priyanka chopra) జోనాస్ నెట్‌వర్త్‌ 620 కోట్లు. కరీన్ కపూర్ (kareena kapoor) ఖాన్ నెట్ వర్త్ సుమారు 485 కోట్ల రూపాయలుగా ఉంది.


Comment As:

Comment (0)