Renu Desai

రేణూ దేశాయ్ సలహా

జిమ్ లో వర్కౌట్లు చేసేటప్పుడు అలా చేయండి- రేణూ దేశాయ్ సలహా

సినిమా న్యూస్- పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai) తన కుమారుడు అకీరా నందన్‌ (Akira Nandan) కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను ఇన్‌ స్టా వేదికగా షేర్‌ చేసింది. ఈ వీడియోలో అకీరా నందన్ జిమ్‌ లో వర్కౌట్లు చేస్తున్నప్పుడు తెలుగు పాటలు వింటూ కనిపించాడు. జిమ్‌ లో ఇంగ్లీష్‌ కు బదులు హిందీ మ్యూజిక్‌ ప్లే చేయాలని అడిగినప్పుడల్లా అక్కడ ఉన్న వాళ్లందరూ నన్నొక చదువురాని పిచ్చిదానిలా చూసేవారని రేణూ దేశాయ్ ఈ సందర్బంగా గుర్తుచేసింది. ఐతే వారిని నేను ఏమాత్రం పట్టించుకోలేదని, జిమ్ లో వర్కౌట్లు చేసేటప్పుడు అర్థం పర్థం లేని ఇంగ్లీష్‌ సాంగ్స్‌ కు బదులు మాతృ భాషలోని పాటలనే వినమంటూ అకీరాను ప్రోత్సహించేదాన్ని అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. 

ఈ క్రమంలో ఇప్పుడు అకీరా నందన్ వర్కౌట్స్‌ టైమ్‌లో హిందీ లేదంటే తెలుగు పాటలు వినడాన్ని చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ప్రస్తుత్తం రేణూ దేశాయ్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నట్లు రేణూ దేశాయ్‌ చాలా రోజుల తరువాత రవితేజ (Raviteja) సినిమా  టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageshwar Rao) లో నటిస్తోంది. ఈ సినిమాలో రేణూ కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Ct6m1eGBK

Comment As:

Comment (0)