MLC Kavitha

ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం..

కవితను తీహార్ జైలులో ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి

నేషనల్ రిపోర్ట్- ఢిల్లీ లిక్కర్ స్కామ్ Delhi Liquar Scam) కు సంబందించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ (CBI) పిటిషన్‌ దాఖలు చేసింది. అందుకు కోర్టు సమ్మతించింది. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో భాగంగా ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత తీహార్ జైలులో ఉన్నారు. అందుకే ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. అంతే కాకుండా కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించగా.. మళ్లీ ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్దమవుతోంది సీబీఐ. కోర్టు అనుమతి ఇవ్వడంతో వచ్చే వారమే కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మధ్యం కంభకోణానికి సంబందించి కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత కేసులో సీబీఐ మరో ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.

అన్నట్లు గత నెల మార్చి 15 ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముడుపులు చేతులు మారాయని, మద్యం విధానం రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు లబ్దిచేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది.


Comment As:

Comment (0)