KCR BRS..

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ గందరగోళం - కేసీఆర్

హైదరాబాద్ రిపోర్ట్- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సర కాలంలో తెలంగాణలో ఏమైనా జరగొచ్చని, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందనన్నారు. మొత్తం 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని కూల్చేందుకు గతంలో బీజేపీ (BJP) ప్రయత్నించిందని చెప్పుచొచ్చారు కేసీఆర్.

మరిప్పుడు కేవలం 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా అని సందేహాన్ని వ్యక్తం చేశారాయన. గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 17 మంది ఎంపీ అభ్యర్థులకు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం అభ్యర్థి నివేదితకు కేసీఆర్ బీ-ఫాంలు అందజేశారు.

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ ఎజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీ, దేశంలోని ఇతర పార్టీల, ప్రభుత్వాలను ఎక్కడ వదిలిపెట్టిందని ప్రశ్నించారు కేసీఆర్. అందుకే ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బీదేపీ వదిలిపెట్టదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో టీమ్‌ వర్క్‌ లేదని వ్యాఖ్యానించిన కేసీఆర్, నేతలకు ఏ మాత్రం స్థిరత్వం లేదన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీని చీల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తే.. ఆ పార్టీలోని కరడుకట్టిన నేతలు వెళ్లరని కేసీఆర్ అన్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు మద్దతిస్తామని కొందరు కాంగ్రెస్‌ నేతలు తనతో చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో ఏ రాజకీయ గందరగోళం ఏర్పడినా అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ర్టంలో జరిగే భవిష్యత్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాబోయే రోజుల్లో మళ్లీ ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారన్న కేసీఆర్.. అధికారం ఉందని వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని నాయకుడు వాపోయాడని చెప్పుకొచ్చారు.

 


Comment As:

Comment (0)