Supreme Court

హైదరాబాద్‌ లో సుప్రీంకోర్టు బెంచ్‌ - లోక్‌సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

నేషనల్ రిపోర్ట్- దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) పర్మినెంట్‌ బెంచ్‌ ను హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేయాలని కోరుతూ చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి (MP Ranjith Reddy) లోక్‌ సభలో శుక్రవారం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారు. ఐదు మంది న్యాయమూర్తులకు తగ్గకుండా హైదరాబాద్ లో పర్మినెంట్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలి. కేసుల సత్వర పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ న్యాయ పరిధిలో కొనసాగే హైదరాబాద్‌ బెంచ్‌ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలి, అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లులో పేర్కాన్నారు. హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ (Supreme Court Bench) ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Comment As:

Comment (0)