గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచీ పోటీ చేయనున్న కేసీఆర్
బీఆర్ఎస్ 115 మంది అభ్యర్ధుల జాబితా
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS) ఎన్నికల నగారా మోగించింది. మిగతా రాజకీయ పార్టీలకంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించింది బీఆర్ఎస్. మొత్తం 115 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్స్ ను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR). అందరి అంచనాలు, ఊహాగానాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేవలం నాలుగు మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికలకు సుమారు మూడున్నర మాసాల ముందుగానే 119 స్థానాలకు గాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా, సిట్టింగుల్లో తొమ్మిది మంది మినహా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లిచ్చారు కేసీఆర్. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ (Gajwel) నియోజకవర్గంతో తోపాటు కామారెడ్డి (Kamareddy) నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించారు.
జనగామ, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనను ఆఖరి నిమిషంలో పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. వేములవాడలో చెన్నమనేని రమేశ్ కు బదులుగా చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం కల్పించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చారు. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, బాపూరావు రాథోడ్, అజ్మీరా రేఖానాయక్ లను తప్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిని మార్చి బండారు లక్ష్మారెడ్డికి అవకాశం కల్పించారు. ఉమ్మజి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గం నుంచి రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి, ఉమ్మజి ఖమ్మం జిల్లాలో వైరా నుంచి రాములునాయక్ స్థానంలో మదన్‌లాల్ కు అవకాశం కల్పించింది బీఆర్ఎస్.
ఇక జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్ధులను పెండింగ్‌లో పెట్టారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులతో ప్రకటించిన మొదటి లిస్ట్ లో ఓసీలకు 57 స్థానాలు, బీసీలు 23, దళితులు 20, గిరిజనులు 12 స్థానాలు, మైనారిటీలకు మూడు స్థానాలు కేటాయించారు. 2018 సెప్టెంబరు ఆరో తేదీన 105 మందితో సీఎం కేసీఆర్ మొదటి జాబితా విడుదల చేయగా... అందులో ఓసీలు 55 మంది, బీసీలు 21, ఎస్సీలు 16, ఎస్టీలు 11, ఇద్దరు మైనారిటీల పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో నలుగురు మహిళలకు స్థానం దక్కింది. ఇక సీట్లు పొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. వారంతా తప్పకుండా విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ రానివారు చిన్నబుచ్చుకొని భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తప్పకుండా టిక్కెట్లు దక్కని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితా...
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా (Adilabad)
--------------------------
సిర్పూర్ - కోనేరు కొనప్ప
చెన్నూరు - బాల్క సుమన్
బెల్లంపల్లి- దుర్గం చెన్నయ్య
మంచిర్యాల - దివాకర్ రావు
ఆసిఫాబాద్- కోవ లక్ష్మి
ఖాన్ పూర్: బుక్య జాన్సన్ రాథోడ్ నాయక్
అదిలాబాద్ - జోగు రామన్న
బోథ్ - అనిల్ జాదవ్
నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad)
--------------------------------
ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి
బోధన్ - షకీల్ అహ్మద్
జుక్కల్ - హనుమంత్ షిండే
బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి - జాజుల సురేందర్
కామారెడ్డి - కేసీఆర్
నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar)
------------------------------------------------------
కోరుట్ల - కల్వకుంట్ల సంజీవ్
జగిత్యాల - ఎం సంజయ్ కుమార్
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి -దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ - గంగుల కమలాకర్
సిరిసిల్ల - కేటీఆర్
చొప్పదండి - సుంకే రవిశంకర్.
వేములవాడ - లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు - రసమయి బాలకిషన్
హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం - కొరుకంటి చందర్
ఉమ్మడి మెదక్ జిల్లా (Medak)
---------------------------------------
సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు
మెదక్ - పద్మా దేవెందర్ రెడ్డి
నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ - చంటి క్రాంతి కిరణ్
జహీరాబాద్ - కొనితి మాణిక్ రావు
సంగారెడ్డి - చింత ప్రభాకర్.
పఠాన్ చెరు - గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్ - కేసీఆర్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy)
----------------------------
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి- మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు
ఉప్పల్ - బండారు లక్ష్మణ్ రెడ్డి
ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ - దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ - ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి - అరికేపుడి గాంధీ
చేవెళ్ల - కాలె యాదయ్య
పరిగి - మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ - మెతుకు ఆనంద్
తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా (Hyderabad)
-----------------------------------
ముషీరాబాద్: ముఠా గోపాల్
మలక్ పేట్ : తీగల అజిత్ రెడ్డి
అంబర్ పేట: కాలేరు వెంకటేశ్ -
ఖైరతాబాద్: దానం నాగేందర్
జూబ్లీహిల్స్: మాగంటి గోపీనాథ్
సనత్ నగర్: తలసాని శ్రీనివాస్ యాదవ్
కార్వాన్ : క్రిష్ణయ్య
చార్మినార్: ఇబ్రహీం లోది
చాంద్రాయణగుట్ట: సితారామ్ రెడ్డి
యాకుత్ పురా: శామ సుందర్ రెడ్డి
బహదుర్ పుర: అలీ బక్రీ
సికింద్రాబాద్ : టి పద్మారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్: లాస్య నందిత
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar)
--------------------------------------
కొడంగల్: పట్నం నరేందర్
నారాయణ్ పేట్: ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్: వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల: సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర: ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్: చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్: బండ్ల కృష్ణమోహన్
ఆలంపూర్: డాక్టర్ అబ్రహం
నాగర్ కర్నూల్: మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట: గువ్వల బాలరాజు
కల్వకుర్తి: జైపాల్ యాదవ్.
షాద్నగర్: అంజయ్య యాదవ్
కొల్లాపూర్: బీరం హర్షవర్ధన్
ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda)
----------------------------------
దేవరకొండ: రమావత్ రవీంద్ర కుమార్
నాగార్జునసాగర్: భగత్
మిర్యలగూడ : నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్: శానంపుడి సైదిరెడ్డి
కోదాడ: బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట : జి జగదీష్ రెడ్డి
నల్గొండ: కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి: పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి: గాదరి కిషోర్
ఆలేరు : గొంగడి సునీత
మునుగోడు: కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal)
--------------------------------------
స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి
పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్: రెడ్య నాయక్
మహబూబాబాద్: శంకర్ నాయక్
నర్సంపేట: పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల: చల్లా ధర్మారెడ్డి
వరంగల్: పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్: ఈస్ట్-నరేందర్
వర్ధన్నపేట: ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ: గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు: నాగమణి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam)
-------------------
పినపాక: రేగ కాంతారావు
ఇల్లందు: బానోత్ హరిప్రియ
ఖమ్మం: పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు : కందాల ఉపేందర్ రెడ్డి
మధిర: లింగాల కమల్రాజు
వైరా: బానోత్ మదన్లాల్.
కొత్తగూడెం: వనమ వెంకటేశ్వర్ రావు
సత్తుపల్లి: సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట: మెచ్చా నాగేశ్వర రావు
భద్రాచలం: తెల్లాం వెంకట్రావు.
BRS 115 candidates List