Vaishnavi-Chaitanya

బిగ్‌ బాస్‌ హౌస్ లోకి బేబీ హీరోయిన్.. వైష్ణవి చైతన్య ఎంట్రీపై ఉత్కంఠ

స్పెషల్ రిపోర్ట్- బిగ్ బాస్ (Bjgg Boss).. ఈ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఇక తెలుగులోను బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్‌కు రెడీ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss season 7 Telugu) ప్రోమో ఇప్పటికే విడుదల కాగా, కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపెంట్ చేసే కంటెస్టెంట్స్ లో కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల (Bankok Pilla) సైతం బిగ్‌ బాస్ హౌస్‌ లో ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. మరి కొంత మంది సెలబ్రిటీల పేర్లను నెటిజన్స్ ముందుగానే అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో ముఖ్యంగా అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటి శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. వారితో పాటు సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యాంకర్ దీపికా పిల్లి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇదిగో ఇటువంటి సమయంలో మరో ఇంట్రెస్టింగ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అది మరెవ్వరో కాదు బేబీ (Baby) హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). అవును వైష్ణవి చైతన్య బిగ్‌ బాస్ హౌస్‌ లో అడుగు పెట్టనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్రయాంగిల్‌ లవ్ స్టోరిగా సాయి రాజేశ్ తెరకెక్కించిన బేబీ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫేమస్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వైష్ణవి చైతన్యని తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.


Comment As:

Comment (0)