Bigg Boss 7

బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ ల జాబితా..

బిగ్‌బాస్‌ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్లే..

స్పెషల్ రిపోర్ట్- అంతా ఎదురుచూసే రియాల్టీ షో బిగ్ బాస్ సిజన్ -7 ( Big Boss-7) వచ్చేసింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నబిగ్‌బాస్‌ ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్‌ 7 (Bigg Boss Telugu 7) ఆదివారం గ్రాండ్‌ గా ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్‌ -7 లో అన్నీ ఉల్టా పుల్టా.. అంటూ ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన అక్కినేని నాగార్జున ముందు బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి వెళ్లి అక్కడి విశేషాలు ప్రేక్షకులకు వివరించారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్‌-7 లో అలరించనున్న కంటెస్టెంట్‌ లను ఒక్కొక్కరిని పరిచయం చేశారు. ఈ క్రమంలో తమ కొత్త చిత్రాలను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) హౌజ్ లో సందడి చేశారు. విజయ్ దేవరకొండ- ఖుషి (Kushi), నవీన్ పొలిశెట్టి- మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ((Miss Shetty Mr Polishetty)) సినిమాలను ప్రమోషన్ చేశారు. బిగ్ బాస్ సీజన్‌-7 లో సందడి  చేయబోతున్న కంటెస్టెంట్స్ ఎవరో  తెలుసా మరి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 కంటెస్టెంట్స్ జాబితా..

1- ప్రియాంక జైన్‌ (priyanka jain)
2- శివాజీ (shivaji)
3- దామిని భట్ల (dhamini bhatla)
4- ప్రిన్స్‌ యవార్‌ (prince yawar)
5- శుభశ్రీ (subhashree)
6- షకీలా (shakeela)
7- సందీప్‌ (sandeep) 
8- శోభాశెట్టి (shobha shetty) 
9- టేస్టీ తేజ (tasty teja) (యూట్యూబర్‌)

10- రతిక రోజ్‌ (rathika rose)

11-డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ (Gautham Krishna)

12- కిరణ్‌ రాథోడ్‌ (Kiran Rathore)

13-పల్లవి ప్రశాంత్‌ (pallavi prashanth)

14-అమర్‌దీప్‌ (Amardeep)


Comment As:

Comment (0)