Petrol Price

పెట్రోల్, డీజిల్ తగ్గే అవకాశం ఉందంటున్న సిటీ గ్రూప్

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం

నేషనల్ రిపోర్ట్- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణంయ తీసుకుంది. పలు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (LPG Price) 200 రూపాయలు తగ్గించింది. ఇదిగో ఇటువంటి సమయంలో ఇప్పుడు అందరి ఆశలు పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలపైకి మళ్లింది. వంట గ్యాస్‌ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతే కాదు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం తగ్గితే అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. 

ఎన్నికలతో పాటు వచ్చే పండగల సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices) తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. వంట గ్యాస్‌ ధర తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం సుమారు 30 బేసిస్‌ పాయింట్లు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్‌గడ్‌ (Chandigarh), మిజోరం (Mizoram) సహా తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా నిత్యావసరాల ధరల తగ్గుదల దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం సుమారు యేడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరల్ని సవరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర 109.66 రూపాయలుగా, లీటర్ డీజిల్‌ ధర 97.82 రూపాయలుగా ఉంది. అటు విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర111.76 రూపాయలుగా,  లీటర్ డీజిల్‌ ధర 99.51 రూపాయలుగా ఉంది. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే సమాన్య, మధ్య తరగతి వారికి భారీ ఊరట లభిస్తుంది. (Petrol and Diesel Prices)


Comment As:

Comment (0)