వైద్యారోగ్యశాఖలో 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్
స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) లో ఉద్యోగాల (Govt Jobs) జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది కేసీఆర్ (KCR) ప్రభుత్వం. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ట్విట్టర్ ద్వార నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు పోస్ట్ చేయడంతో పాటు అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవ్వనుండగా, సెప్టెంబర్ 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు ధరఖఆస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్‌వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ- ఎస్టీ- బీసీ- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు ఉంటుంది.
హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు 31,040- 92,050 రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు రుసుం 500 రూపాయలు. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ఎస్సీ- ఎస్టీ- బీసీ-ఈడబ్ల్యూఎస్ -దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లతో పాటు 18 నుంచి 44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఓఎంఆర్ (OMR) లేదా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తారు. పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా ప్రకటించారు. మరింకెందుకు ఆలస్యం.. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు వెంటనే ధరఖఆస్తు చేసుకోండి మరి.