బిగ్ బాస్ హౌజ్ లో నటుడు శివాజీకి సర్ ప్రైజ్

బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి శివాజీ కొడుకు- ఏడ్చేసిన శివాజి

స్పెషల్ రిపోర్ట్- అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగు (Bigg Boss Telugu 7) ఉల్టా పుల్టా పేరుకు తగ్గట్టుగానే సాగుతోంది. షోలోని కంటెస్టెంట్ లు పెద్దగా అరుచుకోవడం, అంతలోనే కలిసి పోతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బిగ్‌బాస్‌ కూడా వరుస టాస్క్‌లతో కంటెస్టెంట్ లను ఏడిపిస్తూ.. అంతలోనే సర్‌ప్రైజ్‌లతో ఆనందాన్ని నింపుతున్నాడు. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఎమోషనల్‌ సర్‌ప్రైజ్‌ కు నటుడు శివాజీ (Sivaji) తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌ లో కూర్చొని కాఫీ తాగుతున్న శివాజీని డాక్టర్‌ తో చెక్‌ చేయించాలని మెడికల్‌ రూమ్‌కు రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అక్కడికి వచ్చిన డాక్టర్ శివాజీతో మాట్లాడుతూ.. మీ చేయి ఎలా ఉందని అడిగాడు. వ్యాయామాలు చేస్తున్నారా అని వివరాలు కనుక్కొన్నాక.. ఇక వెళ్లండి అని చెబుతూనే ఒక్కసారిగా తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగించి.. డాడ్‌ అని పిలిచాడు. ఆ డాక్టర్‌గా వచ్చింది మరెవరో కాదు.. శివాజీ కొడుకు.

ఇంకేముంది కొడుకును చూసిన శివాజీ ఆనందంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొడుకును హత్తుకుని హౌస్‌లోకి తీసుకువెళ్లాడు. డాక్టర్‌ గా మా పెద్దబ్బాయిని పంపి బిగ్‌ బాస్‌ నాకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడని కంటెస్టెంట్స్‌ అందరితో చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు శివాజి. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమో విడుదలవ్వగా.. ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. తాను చదువుకునేందుకు యూనివర్సిటీకి వెళ్తున్నానని, అందుకే చూడడానికి వచ్చినట్లు శివాజీ అబ్బాయ్ చెప్పాడు. మళ్లీ ఎప్పుడు వస్తానోనని అనగానే.. శివాజీ ఒక్కసారిగా ఎడ్చేశాడు. ఇది చూసి బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 


Comment As:

Comment (0)