KCR CM

ఈనెల మూడవ వారంలో ప్రకటించే ఛాన్స్

బీఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితా రెడీ

హైదరాబాద్ రిపోర్ట్- త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును అధికారి బీఆర్ఎస్ (BRS) పార్టీ పూర్తిచేసిట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేసింది గురాబీ పార్టీ. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కువ శాతం అంటే దాదాపు 80 నుంచి 85 శాతం సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర పార్టీ నుంచి గెలిచి ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారి నియోజకవర్గాల్లో, మొదటి నుంచీ పార్టీలో ఉంటూ టికెట్‌ కోసం పోటీపడుతున్న వారిని అధిష్ఠానం పిలిపించి సర్ధుబాటు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

అక్కడ ఎవరైతే సీటును త్యాగం చేస్తున్నారో.. ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పడగానే ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పోస్టుల హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ కు అవకాశం లేనివారిలో అసంతృప్తి కి అవకాశం ఇవ్వకుండా మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీశ్‌ రావుతో (Harish Rao) పాటు అవసరం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సైతం బుజ్జగింపులు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇక కాంగ్రెస్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు బలమైన అభ్యర్థులుండి, వారు గెలిచే అవకాశం ఉందని భావించే నియోజకవర్గాలపై కూడా బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టిపెట్టిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈనెల మూడో వారంలో మొదటి విడత అభ్యర్దులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేస్తోంది బీఆర్ఎస్. BRS MLA Candidates First List


Comment As:

Comment (0)