Rains

కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు

మరో 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

వెదర్ రిపోర్ట్- తెలంగాణ (Telangana), కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ (Weather Report) ప్రకటించింది. కోస్తాంధ్ర, ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా (Odisha), కేరళ (Kerala), కర్ణాటక (Karnataka), మధ్యప్రదేశ్ (madhya Pradesh) లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈనెల 25 వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పదే అవకాశం ఉందని తెలిపంది.

రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. ఇక హైదరాబాద్ లో హుస్సేన్‌ సాగర్‌ (Hussian Sagar) కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపధ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి సైతం వరద నీరు వచ్చి చేరుతోంది.

 


Comment As:

Comment (0)