Bholashankar

చిరంజీవి భోళా శంకర్‌ కు ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే?

భోళా శంకర్.. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా సినిమా. భారీ అంచనాల మధ్య ఆగష్టు 11 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తమిళంలో సూపర్ హిట్‌ అయిన వేదాళం (Vedaalam) మూవీకి తెలుగు రీమేక్‌ భోళా శంకర్ (Bhola Shankar). ప్రముఖ డైరెక్టర్ మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా నటించగా, కీర్తి సురేశ్‌ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. మరో నటుడు సుశాంత్‌ కీలక పాత్రలో నటించాడు. ఐతే బోళా శంకర్ మొదటి రోజు అనుకున్నమేర కలెక్షన్స్ రాలేదన్న టాక్ వినిపిస్తోంది.


భోళా శంకర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజు 28 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 15.51 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. నైజాంలో 4.50 కోట్లు, సీడెడ్‌ 2 కోట్లు, ఈస్ట్‌ 1.50 కోట్లు, వెస్ట్‌ 1.85 కోట్లు, గుంటూరు 2.07 కోట్లు, కృష్ణా 1.02 కోట్లు, నెల్లూరు 73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్‌ లో 3.1 కోట్లు వసూలు చేసిందని బాక్సాపీస్ లెక్కలు చెబుతున్నాయి. 


ఇక భోళా శంకర్‌ మూవీ సుమారు 80 కోట్ల ప్రిరీలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా హిట్‌ అవ్వాలంటే తక్కువలో తక్కువ 82 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ రావాల్సిఉంటుంది. ఇదేసమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ జైలర్‌ సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఆ ప్రభావం సైతం భోళా శంకర్‌ పై పడిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి గత 5 సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే, ఖైదీ నెం 150-23.16 కోట్లు, ఆచార్య 28.29 కోట్లు, సైరా 36.37 కోట్లు, వాల్తేరు వీరయ్య 22.75 కోట్లు, గాడ్‌ ఫాదర్‌ 12.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. Bhola Shankar Collections 


Comment As:

Comment (0)