Klin Kara

రాంచరణ్ ఉపాసనల పాప పేరు KKK

తన మనవరాలి పేరు చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి

మోగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. రాంచరణ్ (Ramcharan)- ఉపాసన (Upasana) దంపతులకు పాప పుట్టడంతో చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టింది. దీంతో ఆరోజు నుంచి మెగా ఇంట ప్రతి రోజు సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక రాంచరణ్ ఉపాసనలకు పుట్టిన పాపకు ఏ పేరు పెట్టబోతున్నారన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతూవస్తోంది. ఈ చర్చకు తెరతీస్తూ మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి చెప్పేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి పేరు 'క్లీంకార కొణిదెల' (Klin Karaa Konidela) అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు చిరంజీవి. ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్‌ లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును అందరితో పంచుకున్నారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులతో పాటు, ఉపాసన తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ - ఉపాసనల కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.


Comment As:

Comment (0)