కొట్టరా కొట్టు తీన్‌ మారు.. భోళా శంకర్ నుంచి లిరికల్ సాంగ్

మూవీ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భోళా శంకర్‌ (Bholaa Shankar). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) హీరోయిన్. కీర్తిసురేష్‌ (Keerthi Suresh) చిరంజీవికి చెల్లెలి క్యారెక్టర్ లో నటిస్తుండగా, సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కొట్టరా కొట్టు తీన్‌మారు.. కట్టలే తెగేలా హుషారు.. అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ ను విడుదల చేసింది యూనిట్. మహతి స్వర సాగర్‌ బాణీలకు సమకూర్చగా. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. భోళా శంకర్ సినిమా కోసం చిరంజీవి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


Comment As:

Comment (0)