Chiranjeevi Rashmi

చిరు లీక్స్‌ తో సందడి చేస్తున్న వీడియో..

చిరంజీవి పక్కన స్టెప్పులేసిన రష్మి- వైరల్‌గా మారిన భోళా శంకర్‌ సాంగ్ షూట్

మూవీ రిపోర్ట్- చిరు లీక్స్‌  పేరుతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన తమ్ముడు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని సినిమాలో అనుకరించినట్లు చెప్పారు. అయితే ఈ లీక్‌ తోపాటు మరో లీక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi). అవును చిరంజీవి షేర్ చెసిన వీడియోలో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మి.

బజర్దస్త్ యాంకర్‌ గా అలరిస్తూ అప్పుడప్పుడు కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది రష్మి. ఈ జబర్దస్త్‌ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి పక్కన అవకాశాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  చిరు తాజా సినిమా భోళా శంకర్‌ (Bhola Shankar) లో ఆమె నటిస్తోంది. ఐతే రష్మి ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందన్నది సర్వత్రా ఆసక్తిరేపుతోంది. ఇటువంటి టైంలో చిరంజీవి లీక్ చేసిన వీడియోలో మోడ్రన్ డ్రెస్ లో ఆయన పక్కన కనిపించింది రష్మి.

ఖుషీ (Khushi) సినిమాలో యే మేరా జహా పాటకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన డ్యాన్స్ కు సంబందించిన స్టెప్స్‌ వేస్తూ ఆ లీక్‌ వీడియోలో కనిపించారు చిరంజీవి. అంతే కాదు ఈ వీడియోలోనే చిరంజీవి పక్కన రష్మి కూడా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు చిత్ర బృందం కూడా ప్రమోషన్స్‌ ను మొదలుపెట్టే యోచనలో ఉంది. అన్నాచెల్లెల అనుబంధంతో ముడిపడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ కథాంశంతో భోళా శంకర్ సినిమా తెరకెక్కింది.

చిరంజీవి తో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే భయం వేసిందని.. కానీ ఆయన తనను ఎంతో ప్రోత్సహించారని గతంలో చెప్పింది రష్మి. సీన్‌ చేస్తున్నప్పుడు ప్రతి షాట్‌ కు ముందు చిరంజీవి తనతో మాట్లాడేవారని, భోళా శంకర్‌ లో ఆయనతో కలిసి ఓ పాట మొత్తం డ్యాన్స్‌ చేశానని చెప్పుకొచ్చింది. చిరంజీవి అంత పెద్ద స్టార్‌ అయినా.. అందరితో కలిసిపోయే వారని అంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి అద్భుతమైన వ్యక్తి అని గతంలో ఓ ఇంటర్వూలో చెప్పింది రష్మి.

అన్నట్లు భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో వేదాళం మూవీకి రీమేక్‌గా ఈ సినిమాను తీస్తున్నారు. చిరంజీవి సరసన తమన్నా (Tamannaah) నటించిన ఈ మూవీలో కీర్తి సురేశ్‌ (Keerthi Suresh) చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

 


Comment As:

Comment (0)