News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా జరిగిన ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. మీన లగ్నంలో ముక్కొటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఎంతో భక్తి శ్రధ్దలతో ధ్వజారోహణం నిర్వహించారు. ఆ తరువాత రాత్రి పెద శేష వాహనంపై శ్రీవారిని తిరు మాడ వీధుల్లో ఉరేగించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కేసుల నేపధ్యంలో భక్తులెవరిని వాహనసేవకు అనుమతించలేదు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.