News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రానా-ప్రకాష్ రాజ్-కోహ్లీ లకు కోర్టు నోటీసులు

అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఆన్‌లైన్ గాంబ్లింగ్‌ కంపెనీలకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ గాంబ్లింగ్ సంస్థల ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గాంబ్లింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటించడంపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కోర్టు నోటీసులు అందుకున్న సెలబ్రిటీల్లో సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్‌, ప్రకాశ్‌ రాజ్‌లతో పాటు క్రికెటర్ విరాట్‌ కోహ్లి, మాజీ క్రికెటర్ సౌరవ్‌ గంగూలీ లు ఉన్నారు. మద్రాస్ హైకోర్టులో ఆన్‌ లైన్ గ్యాంబ్లింగ్‌ కు వ్యతిరేకంగా ఇటీవల ఓ పీటీషన్ దాఖలైంది. ఆన్‌లైన్ గాంబ్లింగ్‌ వల్ల అనేకమంది జీవితాలు నాశనమవుతున్నాయని పిటీషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

ఆన్ లైన్ గాంబ్లింగ్ కు వాటికి సంబంధించిన ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడం వల్ల సామాన్యులు మంది గాంబ్లింగ్ వైపు ఆకర్షితులవుతున్నారని, అప్పులపాలై చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటీషనర్ తన పిటీషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటీషన్‌ ను విచారించిన మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ఉన్న ప్రకటనల్లో సెలబ్రిటీలు ఎందుకు నటించారని ప్రశ్నించింది. ఈ నెల 19వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హై కోర్టు స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.