మాస్ హీరో రవితేజ సినిమాలో అందాల భామ అనసూయ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అనసూయది కథలో చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ కథా హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అన్సూయను ఓ కీలక పాత్రకు దర్శకుడు రమేశ్ వర్మ ఎంపిక చేశారని తెలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్త, క్షణంలో ఏసీపీ జయ భరద్వాజ్ లాంటి పాత్రలతో నటించి ప్రేక్షకులను అనసూయ మెప్పించింది. మరి కిలాడీ సినిమలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.