డాక్టర్ ను పెళ్లాడిన డాన్సర్
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారు. బిహార్‌కు చెందిన డాక్టర్ మహికను గత మే నెలలో పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవ. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా ఈ వివాహం జరిగింది. ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం ధృవీకరించారు. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ మహికతో ప్రభుదేవా ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. ప్రముఖ హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపిన ప్రభుదేవ.. ఆమెనే పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవ డాక్టర్ ను పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యంలో ముంచింది.