News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆమెను మార్చేసిన నందమూరి బాలయ్య

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ మారిపోయింది. ముందుగా బాలయ్య పక్కన సయేష సెహగల్ ను అనుకున్నారు.. కానీ ఇప్పుడు సయేషాకు బదులు అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకోబోతున్నారట. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఊహించని కారణాల వలన తాజా షెడ్యూల్‌ ప్రారంభమయ్యే సమయానికి సయేష సెహగల్ షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి వచ్చిందట. దీంతో చేసేది లేక సాయేషా బదులు ప్రగ్యా జైశ్వాల్‌ ని బాలయ్య పక్కన హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ శనివారం నుంచి బాలకృష్ణ, ప్రగ్యాపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అన్నట్టు ఈ సినిమాలో ఢీ డ్యాన్స్ షో జడ్జ్ పూర్ణ కూడా నటిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.