రేపు తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు

రానున్న మూడు రోజులు కొన్ని భారీ నుంచి అత్యంత భారీ వర్షాల

రేపు తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు

స్పెషల్ రిపోర్ట్- రానున్న మూడు రోజులు తెలంగాణ (Telangana) లోని కొన్ని జిలలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ రోజు సోమవారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఈ కారణంగా ఆయా చోట్ల మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.  వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,  జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.