కనీసం నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు - పురందేశ్వరి

కనీసం నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు - పురందేశ్వరి

అమరావతి రిపోర్డ్- టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌ ను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) ఖండించింది. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును కూడా పేర్కొనకుండా, తగిన ముందస్తు నోటీసులు లేకుండా నిర్బంధించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నుండి ఎలాంటి వివరణ కోరకపోవడం విచారకరమన్న పురందేశ్వరి.. సరైన విధివిధానాలు పాటించకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కాన్వాయ్‌లో ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలించారు