ప్రపంచకప్‌ క్రికెట్ మ్యాచ్ లు టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ప్రపంచకప్‌ క్రికెట్ మ్యాచ్ లు టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం

స్పోర్ట్స్ రిపోర్ట్- క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ (One Day World Cup 2023) టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈనెల ఆగస్టు 25న మొదలయ్యే టికెట్ల కొనుగోలు కోసం అభిమానులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఐసీసీ (ICC) తెలిపింది. మంగళవారమే ఇందుకు సంబందించిన రిజిస్ట్రేషన్‌ లింక్‌ అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ. వన్డే ప్రపంచకప్‌ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం https:///www.cricketworldcup.com/rgister  లింక్‌ ను క్లిక్‌ చేసి వివరాలు ఎంటర్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. 

ఇఖ ఆగస్టు 25న భారతేతర వార్మప్‌, ఇతర జట్ల టోర్నీ మ్యాచ్‌ లకు టికెట్లు అమ్మనున్నారు. ఆ తరువాత గువాహాటి, తిరువనంతపురం (ఆగస్టు 30), చెన్నై, దిల్లీ, పుణె (ఆగస్టు 31), ధర్మశాల, లఖ్‌నవూ, ముంబయి (సెప్టెంబర్‌ 1), బెంగళూరు, కోల్‌కతా (సెప్టెంబర్‌ 2), అహ్మదాబాద్‌ (సెప్టెంబర్‌ 3)లో జరిగే టీమ్‌ ఇండియా మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15న జరిగే సెమీఫైనల్‌, ఫైనల్‌ టికెట్లు కొనుగోలుచేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం వన్డే ప్రపంచకప్‌ టికెట్ల కోసం వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొండి.