సాయిపల్లవి అక్కడేం చేస్తోంది..
అందాల భామ సాయిపల్లవి గుర్తుంది కదా.. తన సహజ నటనతో, అభినయంతో భారీగా అభిమానులను సంపాదించుకున్న అమ్మడు.. మిగతా హీరోయిన్లతో పోలిస్తే కొంత డిఫరెంట్ అని చెప్పవచ్చు. కధలో పాత్ర తనకు ఏ మాత్రం నచ్చకపోతే.. స్టార్ డైరెక్టర్‌కైనా నో చెప్పేస్తుంది. అంతే కాదండోయ్.. ఎంత డబ్బు ఆఫర్ చేసినా అడ్వర్టైజ్మెంట్లలో నటించడానికి ఏ మాత్రం ఓకే చెప్పదు సాయిపల్లవి.
ఇక అసలు విషయంలోకి వస్తే.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్‌స్టోరీ షూటింగ్లో నాగచైతన్యతో కలిసి పాల్గొంటున్న సాయిపల్లవి ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్ట్ అభిమానులతో పంచుకుంది. చల్లటి గాలిలో.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న తన ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోపై ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ తోపాటు విరాటపర్వం సినిమాలోనూ నటిస్తోంది సాయిపల్లవి.