News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆమె తమిళనాడులో అడుగుపెడితే అంతే..


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారన్న వార్త ఇప్పుడు తమిళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీలో నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అక్రమార్జన కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అను భవిస్తున్న శశికళ వచ్చే జనవరి 27న విడుదల అవుతారని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ప్రకటించారు. ఇంకేముంది అప్పటి నుంచి అధికార అన్నా డీఎంకే పాలకులకు భయం పట్టకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు శశికళ జైలు నుంచి విడుదలై రాష్ట్రంలో అడుగుపెడితే.. అన్నాడీఎంకేలో అనూహ్య మార్పులు నెలకొంటాయని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత వెట్రి మారన్‌ అంటున్నారు. ఇప్పటి వరకు అన్నాడీఎంకేలో అందరూ అనుకున్నట్లుగా పళనిసామి, పన్నీర్‌సెల్వం వర్గాల మాత్రమే కాకుండా గత మూడేళ్లుగా వారి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు, పదవులు పొందని అసంతృప్త ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వీరంతా శశికళ వర్గంలోకి వెళితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు తారుమారవుతాయని పళనిసామి, పన్నీర్‌సెల్వం ఆందోళన చెందుతున్నారు. అందుకే శశికళ జైలు నుంచి విడుదలై అన్నాడీఎంకేలో చీలిక తెచ్చే ప్రయత్నాలను ముందుగానే అడ్డుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు సీఎం పళనిసామి, పనినీర్ సెల్వం.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.