News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బాబ్రీ మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు


బాబ్రీ మసీదును కూల్చివేత కేసులో ఉత్కంఠకు తెరపడింది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ తీర్పును వెలువరించారు. బాబ్రీ మసీదు కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించారు. మిగిలిన 32 మంది నిందితులను సెప్టెంబరు 30వ తేదీ తీర్పు సందర్భంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనెల 16వ తేదీన జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఆదేశించారు. అయితే, కరోనా వైరస్‌ సోకడంతో వీరిలో ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్నారు.

ఇక బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ముందస్తు పధకం లేదని సీబీఐ కోర్టు జడ్జ్ ఎస్ కే యాదవ్ తేల్చి చెప్పారు. ఎలాంటి సాక్షాధారాలు లేని కారణంగా కేసును కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అప్పటికప్పుడు జరిగిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందులో కుట్ర ఉందనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది.

- Advertisement -

ఎల్ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వార కోర్టుకు హాజరయ్యారు. కొవిడ్‌-19, వయసు, ఆరోగ్య కారణాలను చూపి వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఉరికైనా సిద్ధమని, బెయిల్‌ మాత్రం కోరనని గతంలో ఉమాభారతి చెప్పిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రహోంశాఖ అప్రమత్తం చేసింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా పెంచాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వాని, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతీ సహా నిందితులందరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించడం పట్ల బీజేపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

బాబ్రీ మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు

Leave A Reply

Your email address will not be published.