News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అమెరికా అధ్యక్షుడి పీఠం బిడెన్ దే..

- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఈ సస్పెన్స్ కు మరికొద్ది కాసేపట్లో అవకాశం కన్పిస్తోంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు దాదాపు 45 రాష్ట్రాల్లో పూర్తయింది. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం డెమొక్రాట్ పార్టీ తరపున పోటీ చేసిన అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా 264 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాలంటే 270 ఎలక్టోరల్ ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ ఫిగర్‌కు బిడెన్ చాలా దగ్గరగా వచ్చేశాడు. మరో 6 ఎలక్టోరల్ ఓట్లు ఆయనకు అనుకూలంగా వస్తే.. బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టే. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియా రాష్ట్రంలో బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతుండటం ఆయన గెలుపుకు మరింత ఉతమిస్తోంది. ఈ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 99 శాతం పూకావచ్చింది. బిడెన్‌కు మద్దతుగా 2,449,580 ఓట్లు పోలవగా, ట్రంప్‌కు మద్దతుగా 2,448,484 ఓట్లు పోలయ్యాయి. జార్జియా రాష్ట్రంలో బిడెన్‌కు ఆ ఒక్క శాతం కౌంటింగ్‌లో కూడా ఓట్లు అనుకూలంగా వస్తే ఇక వైట్ హౌజ్ పగ్గాలు ఆయనే చేపట్టనున్నారు.

Leave A Reply

Your email address will not be published.