News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వరద సాయం పేరుతో దోచుకున్నారు- ఉత్తమ్

- Advertisement -

వరదల సహాయక చర్యల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.కేసిఆర్ ఉండే ఇంటికీ కిలో మీటర్ దూరంలో వర్షాలకు అన్ని కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేసిఆర్ గాని ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. హైద్రాబాద్ అభివృద్ధికి 67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ చెప్పారని గుర్తు చేసిన ఉత్తమ్.. 67 వేల కోట్లు ఏమయ్యాయో ఆ దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. 2 లక్షల బడ్జెట్ లో కనీసం 5 వేల కోట్ల బడ్జెట్ హైదరాబాద్ కు ఇవ్వా లేరా అని ఆయన ప్రశ్నించారు. వరద భాధితులకు 380 కోట్లు నగదును ఎలా పంపిణీ చేస్తారన్న ఉత్తమ్.. కరోనో సమయంలో 1500 కూడా బాంక్ లో వేశారని గుర్తు చేశారు. ఈ డబ్బులు డ్రా చేసిన అధికారుల్లో ఎవరు ఉన్నారో నోట్ చేసుకున్నామని చెప్పారు. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకు అధికారులు నగదు రూపంలో ఇచ్చారని.. అక్రమాలకు పాల్పడిన వారికి ఎవ్వరిని వదలమని ఉత్తమ్ హెచ్చరించారు. టీఆర్ ఎస్ వాళ్ళతో కలిసి దోచుకుందామనుకున్నానా అని సీఎస్ సోమేష్ కుమార్ ను ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన సోమేష్ కుమార్ ను సైతం వదలమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.