చీరకట్టులో శ్రీదేవిని తలపిస్తోంది
దివంగత సినీతార శ్రీదేవి చీరలో అతిలోక సుందరిగా కనిపించేవారని అందరికి తెలిసిందే. 1980వ దశకంలో చాలామంది మహిళలు శ్రీదేవి చీరకట్టును ఫాలో అయ్యేవారంటే అతియోశక్తి కాదు. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ చీరలో తల్లిని తలపిస్తోంది. దీపావళి పండగను తండ్రి బోనీకపూర్, సోదరి ఖుషీకపూర్తో కలసి ముంబైలోని తమ ఇంట్లో ఘనంగా జరుపుకుంది జాన్వీ కపూర్. ఆ ఫొటోలను ఆమె సోషల్మీడియాలో పంచుకుంది. చీరలో చాలా అందంగా.. అచ్చు తన తల్లి శ్రీదేవిని తలపించింది. మీ హావభావాలు శ్రీదేవిని తలపిస్తున్నాయి అంటూ జాన్వీని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ రూహీ అఫ్జానా, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తోంది.