News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు- ఉత్తమ్

- Advertisement -

టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గడిచిన ఆరేళ్లలో టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లో‌ ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అటు కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందీ, విశ్వనగరమైందీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనేనని ఆయన చెప్పారు. అందుకే ప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ‌ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జంట నగరాలకు కృష్ణా జలాలు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని ఉత్తమ్ గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల కోట్ల అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్‌ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి… టీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. అందుకే టీఆర్ ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.