అధ్యక్ష్య పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెంటనే తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షున్ని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన ఏఐసీసీని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్లే విజయం సాధించింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.