చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు

చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిది కదు

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అరెస్టుపై తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు (Harsih Rao) స్పందించారు. శనివారం సిద్దిసేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దుదృష్టకరమని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం మంచిది కాదని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టుపై పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నేతలు స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారని అంతా ఆశిస్తున్నారు.