టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం కేసు

చంద్రబాబు సహా 20 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం కేసు

స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandra Babu) సహా మొత్తం 20 మందిపై పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేశారు. మొన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో (Angallu) జరిగిన ఘటనల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు (Mudiveedu) పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌ రెడ్డి పేర్లను చేర్చారు పోలీసులు.

వారితో పాటు నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు నమోదు చేశారు. మరికొందరు టీడీపీ (TDP) నేతలపైనా ఇతరుల పేరుతో కేసు నమోదు చేశారు. స్థానిక వైసీపీ నేత ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై సైకిల్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.