ఢిల్లీ నుంచి పవన్ కు పిలుపు- ఎన్డీఏ సమావేశానికి రావాలని ఆహ్వానం

ఢిల్లీ నుంచి పవన్ కు పిలుపు- ఎన్డీఏ సమావేశానికి రావాలని ఆహ్వానం

పొలిటికల్ న్యూస్-  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. బీజేపీ అధిష్టానం పవన్ కు ప్రత్యేక ఆహ్వానం పలికింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ - ఎన్డీఏ () సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాలని పవన్‌ కల్యాణ్‌ కు ఆహ్వానం అందింది. ఎన్డీఏ సమావేశానికి రావాలని ఇప్పటికే భాగస్వామ్య పక్షాల అగ్ర నేతలకు ఆహ్వానాలు పంపిన బీజేపీ నాయకత్వం, తాజాగా పవన్‌ కల్యాణ్‌ ను ఆహ్వానించింది. ఈనెల 18న దిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో తమ భాగస్వామ్యపక్షాలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఎన్టీఏ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.