బిగ్‌బాస్ 10లోకి కడలి ఎంట్రీ? ఒక్క స్టేట్‌మెంట్‌తో మొదలైన చర్చ

బిగ్‌బాస్ 10లోకి కడలి ఎంట్రీ? ఒక్క స్టేట్‌మెంట్‌తో మొదలైన చర్చ

బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 (Bigg Boss Telugu 10) ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంటెస్టెంట్లపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురి పేర్లు వైరల్ అవుతున్నప్పటికీ.. అధికారిక జాబితా మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ప్రముఖ రచయిత్రి, గేయ రచయిత కడలి సత్యనారాయణ (Kadali Satyanarayana) పేరు గట్టిగా వినిపిస్తోంది.

సెప్టెంబర్ తొలి వారంలో బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పదో సీజన్ కావడంతో ఈసారి గేమ్స్, టాస్కులు, హౌస్ డిజైన్‌తో పాటు కంటెస్టెంట్ల ఎంపికలోనూ కొత్తదనం ఉండబోతుందనే టాక్ నడుస్తోంది.

ఇదే సమయంలో కడలి సత్యనారాయణ చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే దీనిపై షో నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తెలుగు భాషపై మక్కువతో రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న కడలి.. 'కడలి కథలు', 'లెటర్స్ టు లవ్' వంటి పుస్తకాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో గేయ రచయితగా, డైలాగ్ రైటర్‌గా కూడా కొనసాగుతున్నారు. 'అర్ధశతాబ్దం', 'మదిలో' వంటి చిత్రాలకు పాటలు, సంభాషణలు అందించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కడలి పేరు బిగ్‌బాస్ సీజన్-10 కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. అయితే ఆమె నిజంగానే హౌస్‌లోకి వస్తారా? లేక ఇది కూడా మరో సోషల్ మీడియా ప్రచారమేనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.