‘జడల్’గా నాని రాక.. ‘ది ప్యారడైజ్’ టీజర్‌తో హైప్
నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలైంది. టీజర్‌లో నాని 'జడల్' (Jadal) అనే పవర్‌ఫుల్ పాత్రలో మాస్ అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
రా యాక్షన్, ఇంటెన్స్ విజువల్స్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్‌తో టీజర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాని లుక్, డైలాగ్ డెలివరీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో మోహన్‌బాబు (Mohan Babu), తనికెళ్ల భరణి (Tanikella Bharani), సోనాలి కులకర్ణి (Sonali Kulkarni), సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu), ఈశ్వరీ రావు (Easwari Rao) కీలక పాత్రలు పోషిస్తుండగా, కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
