మేగాస్టార్ ఇంట చిన్ని కృష్ణుడు.. క్యూట్ ఫొటోతో ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ముగ్గురు పిల్లలతో కలిసి జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. పిల్లలను కృష్ణుడు, రాధారాణి వేషధారణలో ముస్తాబు చేసిన క్యూట్ ఫ్యామిలీ ఫొటో వైరల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈసారి మరింత స్పెషల్‌గా మారాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
వేడుకలకు సంబంధించిన ఓ క్యూట్ ఫ్యామిలీ ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
ఫొటోలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు పెద్ద కుమార్తె క్లీంకార, కవలలు శివరామ్, అన్వీరా దేవి కనిపించారు. చిన్నారులను శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో ముస్తాబు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కల నెరవేరిందంటూ..
తమ పిల్లలతో కలిసి జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని ఉపాసన పేర్కొన్నారు. “కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు” అంటూ ఆమె పంచుకున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు పిల్లల విషయంలో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వచ్చిన రామ్ చరణ్–ఉపాసన.. ముగ్గురు పిల్లలు కలిసి కనిపించిన ఈ అరుదైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేయడంతో మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
ముగ్గురు చిన్నారులు.. ఫస్ట్ జన్మాష్టమి స్పెషల్
రామ్ చరణ్–ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో క్లీంకార జన్మించారు. 2026 జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించారు. కుమారుడికి శివరామ్, కుమార్తెకు అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు.
ఈ ఏడాది ముగ్గురు పిల్లలతో కలిసి జరుపుకున్న జన్మాష్టమి.. మెగా ఫ్యామిలీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.
మొత్తానికి.. మెగా ఇంట్లో చిన్ని కృష్ణుడు, రాధారాణుల సందడి.. ఉపాసన షేర్ చేసిన ఆ ఒక్క ఫొటోతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.
