సనాతన ధర్మం రచ్చపై అనసూయ క్లారిటీ.. ‘నా మాటలను వక్రీకరించారు’

సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ నటి అనసూయ భరద్వాజ్‌ వివరణ ఇచ్చారు. తాను ఏ మతాన్ని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

సనాతన ధర్మం రచ్చపై అనసూయ క్లారిటీ.. ‘నా మాటలను వక్రీకరించారు’

నటి అనసూయ భరద్వాజ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ ఆమె సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తాను ఏ మతాన్ని, వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని అనసూయ స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగత దాడులు, అభ్యంతరకర వ్యాఖ్యలు, బెదిరింపులు చేస్తున్న కొందరి గురించే తాను మాట్లాడానని పేర్కొన్నారు.

తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, తన ధర్మం, విలువలు, విశ్వాసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ధైర్యంగా ఉండటం, నిజం వైపు నిలబడటం, తప్పును తప్పుగా ప్రశ్నించడం, ఎదుటివారిని గౌరవించడం తనకు ధర్మం నేర్పిన విషయాలని చెప్పారు. తన వ్యాఖ్యల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని అనసూయ అన్నారు. మతం ఆధారంగా తాను ఎవరిపైనా నిర్ణయానికి రానని.. తనను వేధించే వారిని మాత్రమే ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.

ఎడిట్‌ చేసిన వీడియోలు, సగం సగం కథనాలను నమ్మకుండా.. పూర్తి విషయం తెలుసుకున్న తర్వాతే అభిప్రాయం ఏర్పరచుకోవాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు.