పెళ్లి పీటలెక్కనున్న 'బుట్టబొమ్మ ' పూజా హెగ్డె

పెళ్లి పీటలెక్కనున్న 'బుట్టబొమ్మ ' పూజా హెగ్డె

పూజా హెగ్డే పెళ్లిపై జోరుగా ప్రచారం.. పెద్దలు కుదిర్చిన సంబంధానికే గ్రీన్ సిగ్నల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కొత్త సినిమా లేదా గ్లామర్ ఫొటోషూట్‌తో కాదు.. ఆమె పెళ్లి వార్తలతో. త్వరలోనే పూజా హెగ్డే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారంటూ సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికి పూజా కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన సంబంధమేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తి సినీ పరిశ్రమకు చెందినవారా? లేక వ్యాపార రంగానికి చెందినవారా? అన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే లేదా ఆమె ప్రతినిధుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు పూజా నుంచి గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక లైలా కోసం' నుంచి స్టార్ హీరోయిన్‌గా..
2014లో నాగచైతన్య సరసన వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత 'ముకుంద'  నటించారు. ప్రారంభంలో ఆశించిన విజయాలు రాకపోయినా.. అల్లు అర్జున్‌తో చేసిన 'డీజే – దువ్వాడ జగన్నాథం' ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది.

ఆ తర్వాత 'అరవింద సమేత వీర రాఘవ', 'మహర్షి', 'అలా వైకుంఠపురములో' వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగారు. 'రంగస్థలం' చిత్రంలోని 'జిగేలు రాణి' ప్రత్యేక గీతంతో మరింత క్రేజ్ సంపాదించారు.

ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోయినా.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో 'శ్రీశ్రీ', రాఘవ లారెన్స్‌తో 'కాంచన-4' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.