ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ రిపోర్ట్- హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో (Uppal Stadium) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సందడి చేశారు. హైదరాబాద్‌- చెన్నై మధ్య జరుగుతోన్న ఐపీఎల్‌ (IPL 2024) మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. కుటుంబంతో కలిసి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్‌ను తిలకించారు. స్టేడియంలో రేవంత్ రెడ్డిని చూసిన క్రికెట్‌ అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ కేరింతలు కొట్టారు. ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ తిలకించారు.